నేడు జవాన్ మురళీ నాయక్ ఇంటికి YS జగన్

-

మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు ఏపీ మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఇవాళ సత్యసాయి జిల్లా కల్లి తండాకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కానున్నారు. ఇటీవల పాకిస్తాన్ దాడుల్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు జగన్. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు ఐంది.

YS Jagan visits Jawan Murali Naik's house today
YS Jagan visits Jawan Murali Naik’s house today

 

ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11:30 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి శ్రీ సత్యసాయి జిల్లాకు వెళ్తారు. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇక అటు వీర జవాన్ మురళి నాయక్ తల్లికి మంత్రి సవిత అన్నం తినిపించారు. వీర జవాన్ మురళి నాయక్‌ను కోల్పోవడంతో ఆయన తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. గత మూడు రోజులుగా వాళ్లు తిండితిప్పలు మానేసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సవిత.. వీర జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రులున్న ఇంటి వెళ్లి.. ఆమె స్వయంగా అన్నం తినిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news