అల్లు అర్జున్ మల్టీప్లెక్సు చూస్తే అదిరి పోవాల్సిందే..!!

-

అల్లు అర్జున్ అంటే తెలుగు ప్రజలలో విపరీతమైన క్రేజ్ వుంది.ఇక పుష్ప తర్వాత తన ఫాలోయింగ్ మామూలుగా లేదు.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన‘పుష్ప’ సినిమా ఊహించని  వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో పాటలు , స్టైల్స్ అన్ని విపరీతంగా ఆదరణ పొందాయి.చాలా మంది క్రికెటర్లు కూడా పుష్ప మ్యానరిజంతో ఎన్నో వీడియోలు చేశారు. రీసెంట్ గా ఈ సినిమా ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు పుష్ప 2కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు పుష్ప 2 స్క్రిప్ట్ కోసం సుకుమార్ చాలా టైమ్ కేటాయించి పనిచేశారు. ఈ సారి కేజీఫ్ కంటే ఎక్కువ మోతాదులో ట్విస్టులు మరియు యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టుకున్నారట.అయితే రీసెంట్ గా ఈ సినిమా రష్యా లో విడుదల సందర్భంగా అల్లు అర్జున్, సుకుమార్, రస్మిక అక్కడకు వెళ్లి ఫ్యాన్స్ తో హంగామా చేశారు. ఇక అల్లు అర్జున్ ఈ గ్యాప్ లో తన క్రేజ్ తో చాలా యాడ్స్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇవి పాన్ ఇండియా స్థాయిలో హల్చల్ చేస్తున్నాయి.

ఇక రీసెంట్ గా అల్లు అర్జున్‌ కూడా మల్టీప్లెక్సు థియేటర్స్  వ్యాపారం స్టార్ట్  చేసాడు. ఏషియన్ అల్లు అర్జున్ పేరిట హైదరాబాద్‌ అమీర్‌పేటలో భారీ మల్టీప్లెక్సును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు పూర్తి చేసుకొని ప్రారంభం కోసం రెడీగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version