వైసీపీది ఢిల్లీలో ఒక మాట, ఆంధ్రా గల్లీలో మరొక మాట : బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే తమ ఓటు అని, తెలుగు రాష్ట్రాలు రెండూ కలిసిపోతే స్వాగతిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. వైసీపీ-టీఆర్ఎస్ రాజకీయ డ్రామా మళ్లీ మొదలైందని అన్నారు. ఏపీ-తెలంగాణ విభజన కేసులు మూసివేయాలంటూ సుప్రీంకోర్టులో ఎందుకు పిటిషన్ వేశారో చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. వైసీపీది ఢిల్లీలో ఒక మాట, ఆంధ్రా గల్లీలో మరొక మాట అని విమర్శించారు. అంతకుముందు సజ్జల మాట్లాడుతూ, రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పడమో, లేక సరిదిద్దడమో చేయాలని అన్నారు. తాము ఇప్పటికీ విభజనకు వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముందని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే.. విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి పోరాటం చేసింది.. మళ్లీ ఉమ్మడి ఎపి అయితే తొలుత స్వాగతించేది వైసిపినేనని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో వ్యాఖ్యానించారు. ఎపి విభజన చట్టం అసంబద్ధమని సుప్రీంకోర్టులో కేసు ఉంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కోర్టులో మా వాదనలు బలంగా వినిపిస్తామన్నారు. విభజన జరిగిన తీరుపైనే న్యాయస్థానంలో కేసు వేశారు. ఉమ్మడి ఎపి కలిసి ఉండాలన్నదే ఇప్పటికీ మా విధానం. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారనే భావన ప్రజల్లో బలంగా ఉంది. మళ్లీ ఉమ్మడి ఎపి కాగలిగే అవకాశముంటే ఆ విషయంలో ఎంతవరకైనా ముందుకెళ్లేది వైసిపినే. ఏ వేదిక దొరికినా మళ్లీ కలిసేందుకే ఓటు వేస్తాం అని సజ్జల వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version