OTTలోకి అల్లు అర్జున్ ఎంట్రీ.. ‘ఆహా’ సర్​ప్రైజ్ అదిరిందిగా

-

తెలుగు ఓటీటీ ప్లాట్​ఫామ్ తన వ్యూయర్ షిప్​ను పెంచుకునేందుకు వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఇండియన్, ఐడల్, కామెడీ స్టాక్ ఎక్సేంచ్, అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే లాంటి షోలతో ఇప్పటికే తన వ్యూయర్స్​షిప్​ను పెంచుకుంది. తాజాగా వ్యూయర్స్​ను విపరీతంగా అట్రాక్ట్ చేసేందుకు ఆహా ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. తన వ్యూయర్స్​కు షాకింగ్ సర్​ప్రైజ్ ఇచ్చింది. అదేంటంటే..?

ఓటీటీ సంస్థ ‘ఆహా’.. బన్నీ ఫ్యాన్స్​ కోసం ఓ బిగ్​ సర్​ప్రైజ్​నే ప్లాన్​ చేసింది. అల్లు అర్జున్​ ఫ్యాన్స్​ కోసం ఓ బిగ్గెస్ట్​ సర్​ప్రైజ్​ను ప్లాన్​ చేసింది. ఇదే విషయాన్ని ‘ఆహా’ సామాజిక మాధ్యమాల్లో అఫీషియల్​గా అనౌన్స్​ చేసింది. “అల్లు అర్జున్​ని మీరు మాస్​గా, క్లాస్​గా చూసుంటారు. ఈసారి ఓ బ్లాక్‌ బస్టర్ లుక్​తో ఆహా మీ ముందుకు తీసుకురానుంది. బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ కోసం రెడీగా ఉండండి.’ అంటూ పోస్ట్​ చేసింది.

ఈ పోస్టు చూసిన బన్నీ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. బన్నీతోనే ఓ షో రన్​ అవుతోందా లేకుంటే ఆల్రెడీ ఆహాలో రన్​ అవుతున్న షోల్లోనే కనిపిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం గురించి సోషల్​ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version