స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న ప్రీ రిలీజ్ వేడుక కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ లు ఎవరూ రాలేదు. అయితే ఈ వేదికగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఈవెంట్‌లో బన్నీ మాట్లాడుతూ.. తెలుగును బతికించాలని అన్నాడు. సినిమాల్లో కూడా ఖచ్చితంగా తెలుగు పాటలు ఉండాలని… వాటిలో తెలుగు జానపదం కనిపించాలని అన్నాడు.
అందుకే తెలుగుఉట్టిపడే పాటల్నే అల వైకుంఠపురం సినిమాల్లో పెట్టుకున్నామన్నారు బన్నీ. ఈ సందర్భంగానే తెలుగు బతికించుకోవాలని, తెలుగు ఉండాలని అన్నాడు. అయితే ఇది ప్రత్యేకంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి అనకపోయినా.. ఏపీలో ఇంగ్లీష్ మీడియం అంటూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లేనని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. దీంతో వైసీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం బన్నీ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.