అల్లు అర్జున్ అరెస్టుపై కావాలనే బీఆఎస్, బీజేపీ తప్పుడు ఆరోపణలు : ఎంపీ చామల

-

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అరెస్ట్ పట్ల బీఆర్ఎస్, బీజేపీ నేతలు కావాలనే మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని, అలా చేయడం సరికాదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు.అల్లుఅర్జున్ అరెస్ట్ పట్ల వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ‘భారతదేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్ట్‌పై చర్చ నడుస్తోందని, ఇదే అదునుగా ప్రతిపక్షాలు సీఎం రేవంత్, కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు.

వీఐపీలు ఎక్కడికి వెళ్లినా..ఏదైనా కార్యక్రమం నిర్వహించినా అన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. అక్కడ ఏదైనా తప్పులు జరిగితే కేసులు పెట్టడం కామన్ అని, థియేటర్ యాజమాన్యంతో పాటు అందరిపై కేసులు పెట్టి, విచారణ జరుపుతున్నారని వెల్లడించారు. అనవసరంగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారన్నారు. తొక్కిసలాట ఘటనలో ఓ నిండు ప్రాణం పోయిందని, మరో ప్రాణం ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోందని, దీని గురించి మాట్లాడకుండా దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. చట్టం అందరినీ సమానంగా చూస్తుందని, చట్టానికి ఎవరు అతీతులు కాదని, అల్లు అర్జున్ ఫేమస్ హీరో అని చెప్పి అతని మీద కేసులు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news