రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమనగల్ రైతులు పాలాభిషేకం చేశారు. రుణమాఫీపై హర్షం వ్యక్తం చేసిన రైతులు సీఎం రేవంత్‌కు పాలాభిషేకం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసింది.దీంతో మహబూబాబాద్ జిల్లా ఆమనగల్ గ్రామంలోని రైతులు తమకు రుణమాఫీ చేసిన సందర్భంగా సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అనంతరం గ్రామస్తులు స్వీట్లు పంచుకొని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోగా, కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లి, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నేతల మాటలకు ప్రజలు మోసపోవద్దని ఆమనగల్ గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.