7 గురు మావోయిస్టుల ఎన్ కౌంటర్ లో కుట్ర జరిగినట్లు చెబుతున్నారు తెలంగాణ రాష్ట్ర కమిటీ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్. అన్నంలో విష ప్రయోగం జరిగినట్టు ఆరోపణలు చేస్తున్నారు. ఏటూరునాగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్కౌంటర్ పై పలు అనుమానాలు ఉన్నాయని అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానిక ప్రజలు వ్యక్తపరుస్తున్నారని తెలిపారు.
చనిపోయిన మావోయిస్టు మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర కమిటీ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్. ఎన్కౌంటర్ పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి చే విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… సంవత్సరం కాలంలో మళ్లీ ఎన్కౌంటర్ తెలంగాణగా మార్చేసిందని ఫైర్ అయ్యారు. అడవిలో పోలీసు శోధన పేరుతో నిత్యం నిర్బంధలను అమల్పరుస్తూ ఎన్కౌంటర్ ల పేరు కాల్చి చంపుతున్నారని ఆగ్రహించారు తెలంగాణ రాష్ట్ర కమిటీ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్.