ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్పంచులు అందరూ కలిసి తమ డిమాండ్ లను నెరవేర్చాలని అమరావతి లోని పంచాయితీ రాజ్ కమిషనరేట్ ను ముట్టడించారు. దీనితో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తతకు మారాయి, ఈ సంఘటనతో అప్రమత్తం అయిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అక్కడకు చేరుకున్న సర్పంచులను వరిసాగు వ్యానులలో అరెస్ట్ లు చేసి స్టేషన్ కు తరలించారు. సర్పంచుల సంఘం నేతలు మా డిమాండ్ లను నెరవేర్చే వరకు ఈ ముట్టడి జరుగుతూ ఉంటుందంటూ తమ గొంతును వినిపించారు. అయితే వీరు అడుగుతున్న ప్రకారం…15 వ ఆర్ధిక సంఘం నిధులు విడుదలయ్యి నెలన్నర కావస్తున్నా ఇంకా ఎందుకు మాకు ఇవ్వలేఅంటూ అడిగారు. గ్రామాల అభివృద్ధికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉదని బాధపడ్డారు. కొన్ని నెలలుగా గ్రీన్ అంబాసిడర్ లకు జీతాలు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు.
అమరావతి: పంచాయతీరాజ్ కమిషనరేట్ ను ముట్టడించిన సర్పంచ్ లను అరెస్ట్ చేసిన పోలీసులు !
-