బాబు మీద అమరావతి ఎమ్మెల్యే ల బ్రహ్మాస్త్రం .. ఇక నోరెత్తే పనిలేదు !!

-

రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉండే ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందిన నాయకులు చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో రైతులను రెచ్చగొట్టే విధంగా ఉద్యమాలు నిరసనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా అమరావతి ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు నరసరావుపేట స్థానిక శాసన సభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన బహిరంగ సభలో షాకింగ్ కామెంట్లు చేశారు.

ముందుగా గోపి రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి లా ఉందని ఎద్దేవా చేశారు. హిందూ మూలంగానే చంద్రబాబు పార్టీని కాపాడుకోవడం కోసం అమరావతి ఉద్యమం చేస్తున్నారని వ్యాఖ్యానించారు తమ జీవనోపాధి కోసం మూడు పంటలు పండే భూమిని చంద్రబాబు తీసుకోవటం న్యాయమా అంటూ ప్రశ్నలు వేస్తూ తన బినామీల కోసం చంద్రబాబు పడుతున్న ఆరాటం చూస్తుంటే అసహ్యం వేస్తోంది అని మరోపక్క అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్ పోరాడుతున్న పటిమకు ప్రజలంతా అండగా ఉండాలి పండు పిలుపునిచ్చారు.

 

ఇదే సందర్భంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ రాజధాని ముసుగులో చంద్రబాబు వ్యాపారం చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో దళిత సోదరులకు ఒక జీవోతో వారి భూములను తిరిగి వారికి ఇవ్వటం జరిగిందని దళిత భూములు లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఇదే తరుణంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. అమరావతి ని బ్రమరావతి గా చేసి తన బినామీల కోసం దళితుల భూములను రెండు వేల ఎకరాలను అడ్డంగా కొట్టేశారని భూ బకాసురులు లాగా తెలుగుదేశం పార్టీ నేతలు గతంలో వ్యవహరించారని ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కోసం బినామీల కోసం చంద్రబాబు ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు. అంబటి రాంబాబు కూడా ఇదే స్థాయిలో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. మొత్తంమీద చూసుకుంటే అమరావతి పరిసర ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు చంద్రబాబు అమరావతి ప్రాంతంలో కేవలం తన కుటుంబ సభ్యుల కోసం బినామీల కోసం ఉద్యమాలు చేస్తున్నట్టుగా ఎమ్మెల్యేలు బ్రహ్మాస్త్రాల కామెంట్లు చేయడంతో దళితుల దగ్గర భూములు లాక్కొని తన బినామీ లను పెంచి పోషిస్తున్న ట్లుగా చంద్రబాబు వ్యవహరించిన తీరు నీ కళ్ళకి కట్టినట్లుగా చెప్పడంతో భవిష్యత్తులో చంద్రబాబు నోరెత్తితే పని లేకుండా పోయింది అని తాజా పరిస్థితులను బట్టి రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version