అమరావతి అసైన్డ్ భూముల కేసు.. తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు

-

అమరావతిలో అసైన్డ్ భూముల కేసులో  అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. అమరావతి అసైన్డ్ భూముల్లో అవకతవకలకు పాల్పడ్డారని  మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణలపై  సీఐడీ కేసు నమోదు చేసింది.  ఈ కేసులపై  ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో తుది విచారణ పూర్తైంది. అయితే తీర్పును  ఏపీ హైకోర్టు  రిజర్వ్ చేసింది.

అసైన్డ్ భూముల్లో అవకతవకలకు పాల్పడ్డారని చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం నమోదు చేసిన విషయం విధితమే. సీఐడీ కేసులపై గతంలోనే స్టే ఇచ్చింది ఏపీ హైకోర్టు. తుది విచారనలో ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఇవాళ తీర్పు రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేవలం అమరావతిలో ఎస్సీల దగ్గర ఉన్న భూములను తక్కువ బినామీలతో నారాయణ కొనుగోలు చేయించారని సీఐడీ పేర్కొంది. వీటికి రక్షణ కల్పించేందుకు కేబినేట్ ఆమోదం లేకుండా జీవో 41 ప్రకారం తీసుకొచ్చారని కోర్టులో వాదనలు వినిపించింది.

బినామీల ద్వారా కొనుగోలు చేసిన అసైన్డ్ భూముల విలువ అప్పట్లో రూ.18కోట్లు ఉండగా.. ఇప్పుడు అది 600 కోట్లకు చేరుకుందని సీఐడీ వెల్లడించింది. గతంలోనే ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తుది విచారణలో ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హై కోర్టు.. ఇవాళ తీర్పు రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news