తెలంగాణ రాష్ట్రానికి కొత్త బీజేపీ చీఫ్ గా ఎన్నికయిన ఎంపీ కిషన్ రెడ్డి బండి సంజయ్ అంత దూకుడుగా లేకపోయినా సమయానికి తగినట్లుగా ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూ వస్తున్నాడు. తాజాగా కిషన్ రెడ్డి BRS పై తనదైన శైలిలో విమర్శలు చేశాడు.. ఈయన మాట్లాడుతూ ఇటీవల బీజేపీ గ్యాస్ ధరలను తగ్గించి ప్రజలకు ఎంతగానో మేలు చేసిందని అంటూనే, ఈ విషయంపై మాట్లాడే అర్హత BRS కు లేదని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు పెట్రోల్ ధరలపై వ్యాట్ ను తగ్గిస్తే ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం తగ్గించలేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి ఏ విధంగా మారిపోయింది అంటే .. మద్యం ద్వారా ఆదాయం రానిదే జీతాలు చెల్లించే ప్రసక్తే లేదు అన్నట్లు ఉంది అంటూ కిషన్ రెడ్డి కేసీఆర్ పాలనా తీరును విమర్శించారు.
ప్రజలు ఇప్పటికైనా గమనించి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించాలని కిషన్ రెడ్డి కామెంట్ చేశారు.