ఏపీ రాజధానుల ఎఫెక్ట్‌: అమరావతిలో మూడో రోజూ కొనసాగుతున్న నిరసనలు

-

ముఖ్యమంత్రి జగన్‌ చేసిన ‘మూడు రాజధానుల’ ప్రకటనకు బాగా దగ్గరగా… ఆయా వ్యవస్థలను మరిన్ని ‘ముక్కలు’గా చేస్తూ కమిటీ తన నివేదిక సమర్పించిన విష‌యం తెలిసిందే. ఒక రాష్ట్రం… మూడు రాజధానులు. అందులోనూ… అనేక ముక్కలు. ఒక హైకోర్టు… రెండు ధర్మాసనాలు. రెండుచోట్ల సీఎం క్యాంపు కార్యాలయాలు. రెండుచోట్ల అసెంబ్లీ సమావేశాలు. ఇవీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక సిఫారసులు. మ‌రోవైపు ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై ఆందోళన చేస్తున్న రైతులు.. జీఎన్ రావు కమిటీ నివేదికపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. నేటి ఉదయం రోడ్లపైకి వచ్చిన మందడం రైతులు అడ్డంగా కూర్చుని నిరసన తెలుపుతున్నారు.

మూడో రోజు రైతుల‌ నిర‌స‌ణ‌లు:

గ్రామంలోకి ఎవరూ రాకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుపై సిమెంటు బెంచీలు, కరెంట్ స్తంభాలు అడ్డం పెట్టారు. మరోవైపు రోడ్డుపై రైతులు టైర్లు తగలబెట్టారు. సీఎం ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో స్పందించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. రైతుల ఆందోళనల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా మందడంలో పోలీసులు భారీగా మోహరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version