కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతా నుంచి అమరిందర్ సింగ్ అవుట్

-

పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ అధిష్టానానికి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. బీజేపీ నేతలను కలుస్తూ కాంగ్రెస్కు క్రమంగా దూరమయ్యారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో ఎంత మాత్రం ఉండబోననే సంకేతాలు కూడా ఇచ్చారు. ప్రస్తుత పరిణామాలన్నింటిని గమనిస్తున్న కాంగ్రెస్ అమరీందర్ సింగ్ కు షాక్ ఇచ్చింది. తాజాగా కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతా నుంచి అమరీందర్ పేరును తొలగించింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో కాంగ్రెస్ నుంచి అమరీందర్ వైదొలగడంపై స్పష్టత వచ్చింది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి అమరీందర్ రాజీనామా చేయనున్నారు. దాదాపుగా 5 దశాబ్ధాలుగా కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి అమరీందర్ సింగ్ గుడ్ బై చెప్పనున్నారు. ప్రస్తుతం పంజాబ్ లో ఉన్న రాజకీయ వాతాావరణాన్ని క్యాష్ చేసుకునేందుకు కొత్త పార్టీ ఏర్పడే అవకాశం ఉంది. బీజేపీ కూడ పంజాబ్లో పాగా వేేసేందకు తయారవుతోంది. గతంలో మిత్రపక్షంగా ఉన్న అకాళీదళ్ వ్యవసాయ చట్టాల వల్ల ఎన్డీయే నుంచి వైదొలిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version