హువామీ కంపెనీ అమేజ్‌ఫిట్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో విడుదల చేసింది. అమేజ్‌ఫిట్ బిప్ ఎస్ లైట్ పేరిట ఆ వాచ్ విడుదలైంది. ఇందులో 1.28 ఇంచుల కలర్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇందులో ఉన్న బ్యాటరీ 30 రోజుల వరకు బ్యాకప్‌ను ఇస్తుంది. 8 రకాల స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇందులో అందిస్తున్నారు.
ట్రెడ్‌మిల్, ఔట్‌డోర్ రన్నింగ్, వాకింగ్, ఇండోర్ సైక్లింగ్, ఔట్‌డోర్ సైక్లింగ్ తదితర మోడ్స్‌ను ఈ వాచ్‌లో అందిస్తున్నారు. ఈ వాచ్ సహాయంతో హార్ట్ రేట్ తెలుసుకోవచ్చు. హార్ట్ రేట్ వార్నింగ్ ఫీచర్‌ను కూడా ఇందులో అందిస్తున్నారు. ఈ వాచ్ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను కల్పించారు. ఫోన్‌కు ఈ వాచ్‌ను పెయిర్ చేస్తే అందులో వచ్చే నోటిఫికేషన్లను వాచ్‌లో చూసుకోవచ్చు. కాల్స్, మెసేజ్‌లు, ఈ-మెయిల్స్, వాతావరణం, ఇతర యాప్‌లకు చెందిన నోటిఫికేషన్లను ఈ వాచ్‌లో చూసుకోవచ్చు.
బ్లూటూత్ 5.0 ద్వారా ఈ వాచ్ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. ఫోన్‌లో మ్యూజిక్‌ను ఈ వాచ్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ 5.0 ఆపైన వెర్షన్, ఐఓఎస్ 10.0 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లకు ఈ వాచ్ కనెక్ట్ అవుతుంది. ఈ వాచ్‌ను బేసిక్ అవసరాల కోసం వాడితే ఇందులో ఉన్న 200 ఎంఏహెచ్ బ్యాటరీ 30 రోజుల వరకు బ్యాకప్‌ను ఇస్తుంది. 30 రోజుల వరకు స్టాండ్‌బైలో ఉంటుంది. చార్‌కోల్ బ్లాక్, ఆక్స్‌ఫర్డ్ బ్లూ, సకురా పింక్ కలర్ ఆప్షన్లలో ఈ వాచ్ విడుదల కాగా.. దీన్ని రూ.3,799 ధరకు ఫ్లిప్‌కార్ట్ లేదా అమేజ్‌ఫిట్ సైట్లలో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.