ఐస్ టీతో అద్భుత ప్రయోజనాలు

-

సాధారణంగా టీ అంటే అందరికీ ఇష్టం. ఉదయాన్నే లేచినప్పుడు టీ తాగి డే స్టార్ట్ చేయాలని చాలా మంది భావిస్తుంటారు. అలాగే వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. కొంచెం టీ తాగి రిలాక్స్ అవ్వాలని మరికొందరు అనుకుంటారు. టీలో చాలా రకాలు విన్నాం. అల్లం టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, అస్సాం టీ ఇలా చాలు రకాల పేర్లు. అయితే ఐస్ టీ గురించి చాలా మందికి తెలియదు. అయితే ఐస్ టీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ టీ తాగడం వల్ల మానసిక ఉల్లాసం మరింత పెరుగుతుందన్నారు. ఐస్ టీని ఆసియా దేశాలతోపాటు బ్రిటన్, రష్యా దేశాల్లో ఎక్కువగా తాగుతుంటారు. బ్లాక్ టీ అయినా.. గ్రీన్ టీ అయినా తేయాకు మొక్కల నుంచే టీ పొడి తయారు అవుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుతం ఐస్ టీకి ప్రపంపవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తోంది.

 

ఐస్ టీ

 

ఐస్ టీ తాగితే డీ హైడ్రేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు. రోజువారీగా తాగడం వల్ల మన శరీరంలో నీటి శాతం పెరుగుతుందన్నారు. అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నారు. శరీరంలో నిల్వ ఉన్న విష వ్యర్థాలను తొలగించడంతో ఐస్ టీ ఎంతో పనిచేస్తుందన్నారు. టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాపాడి, ఫ్రీ రాడికల్స్‌ సమస్యను పరిష్కరిస్తుందన్నారు. పండ్లు, కూరగాయల్లో కంటే 8 రెట్లు ఎక్కువగా టీలో పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని నిపుణులు వెల్లడించారు. 350 గ్రాముల కూల్‌డ్రింక్‌లో 39 గ్రాముల పంచదార ఉంటుంది. అది తొమ్మిదిన్నర టీస్పూన్‌లకు సమానం. దీని వల్ల 140 కేలరీల శక్తి వస్తుంది. అదే 350 గ్రాముల ఐస్ టీలో షుగర్ ఉండదు. 2 కేలరీల శక్తే వస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఈ టీ దివ్వౌషధం. దంతాలను కాపాడటంతో ముఖ్యభూమిక పోషిస్తుంది. దంతాలను పాడుచేసే కేవిటీస్‌పై పోరాడుతుంది. టీలో ఉండే పోషకాలు కాన్సర్‌తో పోరాడతాయని, దాదాపు 3వేలకుపైగా పరిశోధనల్లో ఇది నిర్ధారణ అయిందన్నారు.

 

ఐస్ టీలో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. 300 గ్రాముల బ్లాక్ ఐస్ టీ, 520 మైక్రో గ్రాముల మాంగనీస్ ఇస్తుంది. ఇది మహిళలకు కావాల్సిన మాంగనీసులో 35 శాతం కవర్ చేస్తుంది. మగవాళ్లకైతే 23 శాతం కవర్ చేస్తుంది. మాంగనీస్ వల్ల దెబ్బలు త్వరగా నయం అవుతాయి. దీంతోపాటు ఎముకలు ధృడంగా మారుతాయి. టీ తాగేవారికి ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. రోజూ 4 కప్పుల బ్లాక్ టీని 6 వారాల పాటూ తాగితే రక్తంలోని కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్‌ను తగ్గిస్తుంది. ఐస్ టీ గుండెకు ఎంతో మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. రోజూ మూడు కప్పుల ఐస్ టీ తాగేవాళ్లలో హార్ట్‌ఎటాక్ వచ్చే అవకాశం కొంతమేర తగ్గుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version