ప్రతి వంట గదిలో సులభంగా దొరికే అద్భుతమైన ఔషధం లవంగాలు. ఇవి ఆహార రుచిని పెంచడమే కాక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. రాత్రి పడుకునే ముందు లవంగాలు నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రయోజనాలు మనం వివరంగా తెలుసుకుందాం..
జీర్ణ క్రియ మెరుగుపడుతుంది : లవంగాలలోని యాంటీఆక్సిడెంట్లు మరియు సహజమైన ఎంజైములు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. రాత్రి పడుకునే ముందు లవంగల నీరు తాగడం వల్ల గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ క్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాక ఇవి పేగు కదలికలను మెరుగుపరిచి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి.
నిద్రలేని సమస్యకు చెక్ : లవంగాల్లో యూజెనాల్ ఎంజైము ఉండడం వలన ఇది ఒత్తిడిని ఆందోళన తగ్గిస్తుంది రాత్రి పడుకునే ముందు లవంగల నీరు తాగడం వలన మన మనసు ప్రశాంతంగా ఉండి మంచి నిద్ర లభిస్తుంది. నిద్రలేని సమస్యలతో బాధపడేవారు ఒకసారి ఈ లవంగాలు నీరు తాగడం వలన మంచి నిద్రను పొందవచ్చు.
రోగ నిరోధక శక్తి పెరుగుదల : లవంగాల లో విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు, యాంటీ మైక్రో గుణాలను కలిగి ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఈ నీరు తాగడం వల్ల శరీరంలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ ను ఎదుర్కొనే శక్తి మనకి పెరుగుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
కాలేయ ప్రాబ్లమ్స్ కి చెక్: లవంగాల నీరు తాగడం వలన శరీరంలో విష పదార్థాలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. ఇది కాలేయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రాత్రి లవంగాలు నీరు తాగడం కాలేయానికి డిటాక్సిఫికేషన్ ప్రక్రియ మెరుగుపరచడం తద్వారా కాలేయ సంబంధిత సమస్యలు కొంతమేర తగ్గుతాయి.
నోటి దుర్వాసన కు : లవంగాల్లోని యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇవి నోటి దుర్వాసన పంటి నొప్పి, చిగుళ్ల వాపు, వంటి సమస్యలను తగ్గిస్తాయి. రాత్రి ఈ నీరు తాగడం నోటి పరిశుభ్రత మెరుగుపరచడమే కాకుండా నోటి ఆరోగ్యానికి ఇది ఎంతో సహాయపడుతుంది.
మహిళలకు ప్రత్యేకమ్ : ప్రతి మహిళ నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్లు కడుపులో నొప్పిని తగ్గించడంలో లవంగాలు నీరు సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
తయారీ విధానం: ఒక గ్లాస్ నీటిలో ఐదు నుంచి ఏడు లవంగాలను వేసి రాత్రంతా నానబెట్టాలి. మూత పెట్టి ఉంచి లవంగాల్లోని పోషకాలు నీటిలో కలిసేలా చేయాలి. ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు ఈ నీటిని వడకట్టి తాగాలి. కావాలనుకునేవారు కొంచెం నీటిని వేడి చేసి కూడా తాగవచ్చు.
Note : (ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఆరోగ్య సమస్య ఏదైనా ఉంటే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి.)