కాంగ్రెస్ నేతలు ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఆరోపించారు. ఇవాళ లోక్సభలో ఆయన ‘ఆపరేషన్ సిందూర్ ‘పై మాట్లాడుతూ.. పహల్గాం దాడి కేవలం పర్యాటకుపై కాదని.. తాము దేశంపై దాడిగా పరిగణించామని అన్నారు. దాడి చేసిన వారిని ఇప్పటికే మట్టిలో కలిపేశామని.. 140 కోట్ల మంది ప్రజల గుండె చప్పుడును మోడీ ప్రపంచానికి చాటారని పేర్కొన్నారు. పాక్పై దాడులు చేసేందుకు భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని కామెంట్ చేశారు. మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టి 9న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని వివరించారు. మన భద్రతాబలగాల దాడుల్లో ఒక్క పౌరుడు కూడా మరణించలేదని అమిత్ షా తెలిపారు.
జవహర్ లాల్ నెహ్రూ నిర్ణయం వల్ల జమ్మూకశ్మీర్లో అనేక సమస్యలు వచ్చాయని.. మన భద్రతా బలగాలు పాక్ వైపు ముందుకు వెళ్తుంటే నెహ్రూ అడ్డుకోలేదా అని ఫైర్ అయ్యారు. బంగ్లాదేశ్ యుద్ధంలో జనరల్ మాణిక్ షా వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. పాకిస్తాను క్లీన్చిట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎందుకు ప్రయత్నిస్తోందని ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనలు జరిగితే.. తాము కాంగ్రెస్ చూస్తూ కూర్చొలేమని, దెబ్బకు దెబ్బ కొట్టి తీరుతామని స్పష్టం చేశారు. నాడు నెహ్రూ మన దేశంలోని 80 శాతం జలాలను పాక్ అప్పగించారని, జమ్మూకశ్మీర్ విషయంలో మమ్మల్ని ప్రశ్నించే అధికారం కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు.