ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా లోక్ సభలో పీఎం మోడీ పై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సెటైర్లు వేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. దానిపై మోడీ క్రెడిట్ తీసుకున్నారు. ఒలింపిక్స్ లో ఎవరైనా పతకం సాధిస్తే.. దానికి కూడా ఆయనే క్రెడిట్ తీసుకుంటారు. తీసుకోండి.. బాధలేదు. కానీ బాధ్యత కూడా తీసుకోవాలి కదా..? పహల్గామ్ భద్రత వైఫల్యానికి బాధ్యత ఎవరు వహిస్తారు..? అని ప్రశ్నించారు ప్రియాంక గాంధీ.
ఇక టీఆర్ఎఫ్ అనేది కొత్తగా రాలేదని.. కాశ్మీర్ లో చాలా చోట్ల ఆ ఉగ్ర సంస్థ దాడి చేసిందన్నారు. 2024లో టీఆర్ఎఫ్ దాడుల్లో 9 మంది చనిపోయారని తెలిపారు. అయినా ఉగ్రవాద సంస్త వరుస దాడులు చేస్తుంటే.. కేంద్రం ఏం చేస్తోంది అని అడిగారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు బాధ్యత ఎవరిది..? హోంమంత్రి లేదా ఐబీ చీఫ్ ఎవరైనా రాజీనామా చేశారా..? అని నిలదీశారు ప్రియాంక గాంధీ.