అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంచలన ప్రకటన

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరో సంచలన ప్రకటన చేశారు. కరేజ్ అండ్ సివిలిటీ పేరుతో అవార్డును ప్రకటించారు జెఫ్ బెజోస్. ఈ తొలి అవార్డును ఇద్దరు ప్రముఖ వ్యక్తులకు ప్రధానం చేయనున్నారు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్. ప్రముఖ చెఫ్ జోష్ ఆండ్రెస్ కు అవార్డు ఇవ్వనున్నట్లు కీలక ప్రకటన చేశారు.

అలాగే సామాజిక కార్యకర్త వ్యాన్ జోన్స్ కు అవార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు జెఫ్ బెజోస్. ఈ నిర్ణయంతో ప్రముఖ చెఫ్ జోష్ ఆండ్రెస్ మరియు సామాజిక కార్యకర్త వ్యాన్ జోన్స్ కు ఈ అవార్డు రానుంది.

ఈ అవార్డు కింద ఇద్దరికీ చెరో వంద మిలియన్ డాలర్లు బహుమానం చేయనున్నారు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్. కరోనా మహమ్మారి సమయంలో భారతదేశంలో కొన్ని లక్షల మందికి చెఫ్ జోష్ ఆండ్రెస్ ఆహారం అందించారు. అలాగే అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక కార్యకర్త వ్యాన్ జోన్స్ కృషి చేశారు. కాగా రోదసీ యాత్ర తర్వాత అవార్డుల ప్రకటన చేశారు జెఫ్ బెజోస్.