అమెజాన్ కి రూ.290 కోట్లు జరిమానా..!

-

ఈ కామర్స్ వ్యాపార దిగ్గజం అమెజాన్ భారీ జరిమానా ఎదుర్కొంది వివరాలకు వెళ్తే ఫ్రాన్స్ డేటా ప్రొడక్షన్ ఏజెన్సీ సిఎన్ఐఎల్ ఉద్యోగుల పని తీరు మీద హద్దు దాటి నిఘా ఉంచిన కారణంగా 32 మిలియన్ యూరోలు అంటే భారత్ కరెన్సీలో సుమారు 290 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశాలిచ్చారు. యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొడక్షన్ రెగ్యులేషన్ ప్రకారం ఉద్యోగుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడం వినియోగం గురించి వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. దీనికి విరుద్ధంగా అమెజాన్ డేటా సేకరించినట్లు సీఎన్ఐఎల్ ఆరోపణలు చేస్తుంది.

ఉద్యోగుల నుండి ఫిర్యాదులు అందాయని విచారణ తర్వాత జరిమానా విధించినట్లు స్పష్టం చేశారు. ఆర్డర్ చూసే ప్యాకేజీలని ప్రాసెస్ చేయడానికి సిబ్బందికి ఉపయోగించే స్కానర్ల ద్వారా కంపెనీ నిఘా ఉంచినట్లు తెలిపారు. 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం స్కానర్లు పనిచేయకపోతే మేనేజ్మెంట్ కి అలెర్ట్ మెసేజ్ పంపుతాయి దాని ఆధారంగా ఉద్యోగుల పనితీరుని కంపెనీ సమీక్షిస్తున్నట్లు వివరించింది. ఎంతసేపు ఉద్యోగులు పని ప్రదేశాల్లో ఉంటున్నారు అనేది కూడా సేకరిస్తున్నట్లు పేర్కొంది నిఘా వలన ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news