ఉదయం 6.30 నుంచే స్టేడియంలోకి అనుమతి : రాచకొండ సీపీ

-

భారత్-ఇంగ్లండ్ మధ్య రేపు మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే గురువారం ఉదయం 6.30 గంటల నుంచే క్రికెట్ అభిమానులను ఉప్పల్ స్టేడియంలోకి అనుమతిస్తామని తెలిపారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. ఉప్పల్ స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలున్నాయని.. పోలీస్ అధికారులపై కూడా నిఘా ఉంచుతామని చెప్పారు. పీక్ హవర్స్ లో మైదానానికి ప్రేక్షకులు వస్తారు కాబట్టి స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని రాచకొండ సీపీ పేర్కొన్నారు.

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కి రంగం సిద్ధం అయింది. హైదరాబాద్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడారు. పీక్ హవర్స్ లో ప్రేక్షకులు వస్తారు కాబట్టి స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలుంటాయి. 1500 మంది పోలీసులతో మ్యాచ్ కి బందోబస్తు ఏర్పాటు చేశాం. అక్టోపస్ బలగాలు కూడా ఉంటాయి. 100 షీ టీమ్స్ మఫ్టీలో ఉంటాయి. స్టేడియంలోకి కెమెరాలు, ల్యాప్ ట్యాప్, బ్యాగ్స్, సిగరెట్స్, హెల్మెట్స్, వాటర్ బాటిల్స్, పెన్స్, పవర్ బ్యాంక్స్, బయటి ఫుడ్ అనుమతించం అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news