అమెజాన్‌లో ఫ్రీడం సేల్‌.. బారీ త‌గ్గింపు ధ‌ర‌లు..!

-

ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న సైట్‌లో మ‌రో కొత్త సేల్‌ను శ‌నివారం ప్రారంభించింది. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా శ‌నివారం నుంచి ఆగ‌స్టు 11 వ‌ర‌కు అమెజాన్ ఫ్రీడం సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా అనేక ఉత్ప‌త్తుల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్లు, రాయితీల‌ను అందిస్తోంది. ఇటీవ‌ల నిర్వ‌హించిన ప్రైమ్ డే సేల్ కేవ‌లం ప్రైమ్ మెంబ‌ర్ల‌కే అందుబాటులో ఉండ‌గా.. ఫ్రీడం సేల్‌లో మాత్రం క‌స్ట‌మ‌ర్లు ఎవ‌రైనా స‌రే ఆఫ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు.

అమెజాన్ ఫ్రీడం సేల్‌లో ఎస్‌బీఐ కార్డుల‌తో ఐట‌మ్స్‌ను కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌట్ ఇస్తారు. స్మార్ట్‌వాచ్‌ల‌పై 60 శాతం వ‌ర‌కు రాయితీ పొంద‌వ‌చ్చు. హోం థియేట‌ర్లు, సౌండ్ బార్‌ల‌పై కూడా 60 శాతం డిస్కౌంట్ ఇస్తారు. ఐఫోన్ 11ను రూ.59,900 ప్రారంభ ధ‌ర‌కే కొన‌వ‌చ్చు. రూ.2,990 విలువైన బోట్ రాక‌ర్జ్ 255 స్పోర్ట్స్ వైర్‌లెస్ హెడ్‌సెట్ కేవ‌లం రూ.999కే ల‌భిస్తుంది.

సేల్‌లో ఒప్పొ ఫైండ్ ఎక్స్‌2 ఫోన్ రూ.5వేల తగ్గింపుతో రూ.64,990 ధ‌ర‌కు ల‌భిస్తోంది. రెడ్‌మీ 8ఎ డ్యుయ‌ల్‌ను రూ.8,999కు బ‌దులుగా రూ.8,299కే కొన‌వ‌చ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎం21ను రూ.17,119కు బ‌దులుగా రూ.15,999కే కొన‌వ‌చ్చు. ఇవే కాకుండా అనేక ఉత్ప‌త్తుల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్లు, డిస్కౌంట్ల‌ను కూడా అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version