అమెజాన్‌లో ఆపిల్ డేస్ సేల్‌.. ఆపిల్ ప్రొడ‌క్ట్స్‌పై త‌గ్గింపు ధ‌ర‌లు..

-

ఆపిల్ ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా ? అయితే అందుకు ఇదే స‌రైన స‌మ‌యం అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే అమెజాన్‌లో నేటి అర్థ‌రాత్రి నుంచి (జూలై 19 నుంచి) ఆపిల్ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో ఐఫోన్లు, మాక్‌బుక్ త‌దిత‌ర యాపిల్ ఉత్ప‌త్తుల‌పై ఉత్త‌మ డీల్స్ పొంద‌వ‌చ్చు. ఈ సేల్ జూలై 25వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

amazon india announced apple days sale from july 19th

సేల్‌లో భాగంగా ఐఫోన్ 11పై వినియోగ‌దారులు రూ.5,400 వ‌ర‌కు ఫ్లాట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధ‌ర రూ.62,900గా ఉంది. ఐఫోన్ 8 ప్ల‌స్‌ను రూ.41,500కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే ఆయా ఆపిల్ ప్రొడ‌క్ట్స్‌పై నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందివ్వ‌నున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్ కార్డుల‌ను వాడితే అద‌న‌పు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

ఐఫోన్, ఐప్యాడ్‌, ఐపాడ్ ట‌చ్‌, మాక్ లేదా ఆపిల్ టీవీ డివైస్‌ల‌ను కొంటే నెల రోజుల పాటు ఆపిల్ టీవీ ప్ల‌స్‌కు గాను ఉచిత స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను పొంద‌వ‌చ్చు. ట్ర‌య‌ల్ త‌రువాత నెల‌కు కేవ‌లం రూ.99 చెల్లించి స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను కొన‌సాగించ‌వ‌చ్చు. ఆపిల్ యాక్స‌స‌రీల‌పై రూ.5వేల వ‌ర‌కు గ‌రిష్ట డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. ఆపిల్ వాచ్ సిరీస్ 3 వాచ్‌ల‌పై రూ.1వేయి వ‌ర‌కు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. ఆపిల్ మాక్‌బుక్ ప్రొపై హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో రూ.7వేల వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news