వావ్.. అద్భుతం.. అమెజాన్ కొత్త ఫిట్ నెస్ బ్యాండ్‌..!

-

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కొత్త‌గా అమెజాన్ హాలో పేరిట హెల్త్‌, వెల్‌నెస్ స‌ర్వీస్‌ను ప్రారంభించింది. ఈ స‌ర్వీస్‌ను తీసుకునే వారికి అమెజాన్ హాలో స్మార్ట్‌బ్యాండ్‌ను ఇస్తారు. దీంతోపాటు ఫోన్ లో అమెజాన్ హాలో యాప్ ను వాడుకోవ‌చ్చు. రెండింటికీ క‌లిపి 6 నెల‌ల హాలో మెంబ‌ర్‌షిప్‌కు 64.99 డాల‌ర్లు (దాదాపుగా రూ.8,400) అవుతుంది. దీని వ‌ల్ల ఓ వైపు బ్యాండ్‌ను ఉప‌యోగిస్తూనే మ‌రోవైపు అమెజాన్ హాలో యాప్ హెల్త్ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు.

అమెజాన్ హాలో బ్యాండ్‌కు ఇత‌ర స్మార్ట్ వాచ్ లు, బ్యాండ్స్‌లా డిస్‌ప్లే ఉండ‌దు. కానీ దీన్ని వాటిలా చేతికి ధ‌రించ‌వ‌చ్చు. ఇందులో యాక్స‌ల‌రోమీట‌ర్‌, టెంప‌రేచ‌ర్ సెన్సార్‌, హార్ట్ రేట్ మానిట‌ర్‌, రెండు మైక్రోఫోన్లు, ఎల్ఈడీ ఇండికేట‌ర్ లైట్‌, మైక్రోఫోన్ల‌ను ఆన్‌, ఆఫ్ చేసే బ‌ట‌న్లు ఉంటాయి. దీనికి వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను కూడా అందిస్తున్నారు. ఈ బ్యాండ్ 90 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. ఒక్క‌సారి ఫుల్ చార్జి చేసే 7 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్ వ‌స్తుంది. దీనికి ఫాబ్రిక్‌, సిలికాన్ త‌ర‌హా బ్యాండ్స్ ను 15 ర‌కాల భిన్న క‌ల‌ర్లలో అందిస్తున్నారు.

హాలో యాప్ చేతికి ధ‌రించిన హాలో బ్యాండ్‌కు క‌నెక్ట్ అవుతుంది. దీని స‌హాయంతో నిద్ర‌, ఎక్స‌ర్‌సైజ్‌, సెడెంట‌రీ టైమ్ త‌దిత‌ర యాక్టివిటీల‌ను ట్రాక్ చేయ‌వ‌చ్చు. అలాగే బాడీ ఫ్యాట్ శాతం ఎంత ఉందో తెలుసుకోవ‌చ్చు. దీంతోపాటు యూజ‌ర్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడా లేదా అని అత‌ని గొంతును ట్రాక్ చేసి చెబుతుంది. ఈ విధంగా అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను హాలో యాప్, హాలో బ్యాండ్‌ల‌లో అందిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతానికి ఈ బ్యాండ్ కేవ‌లం అమెరికా పౌరుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది. దీన్ని ఇత‌ర దేశాల్లో విడుద‌ల చేసే విష‌య‌మై అమెజాన్ ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.

అయితే హాలో యాప్ లో స్టోర్ అయ్యే డేటాకు పూర్తిగా ర‌క్ష‌ణ ఉంటుంద‌ని అమెజాన్ తెలిపింది. ఆ డేటాను ఎన్‌క్రిప్టెడ్ క్లౌడ్ స‌ర్వ‌ర్ల‌లో స్టోర్ చేస్తామ‌ని, యూజ‌ర్లు త‌మ డేటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేయ‌వ‌చ్చ‌ని, అవ‌స‌రం అయితే డేటాను డిలీట్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version