అన్నమయ్య భవనం వేదికగా టిటిడి ధర్మకర్తలు కీలక నిర్ణయాలు

-

తిరుమల అన్నమయ్య భవనం వేదికగా టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం ఇవాళ జరిగింది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. 52 అంశాలతో కూడిన సుదీర్ఘ అజెండాతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సెప్టెంబర్‌ నెలలో జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణ, శ్రీవారి దర్శనానికి భక్తుల సంఖ్య పెంపు అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. దాదాపు మూడు నెలల పాటు భక్తుల దర్శనాలు నిలిపివేయడం….లాక్‌డౌన్‌ సడలింపు అనంతరం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతి వంటి సమస్యలతో టిటిడి ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.

దీంతో ఆలయ నిర్వహణ, టిటిడి ఉద్యోగుల జీతభత్యాల అంశాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇవాళ జరిగే సమావేశంలో ఈ అంశంపై చర్చించారు.ఎక్కువ శాతం వడ్డీ రావడానికి బంగారం డిపాజిట్‌ 5 సంవత్సరాలకు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇంకా పాత నోట్లు వస్తున్నాయని అధికారులు చెప్పారు. అయితే వీటిని మార్పిడికి చేయడానికి ఆర్‌బీఐతో సంప్రదింపులు చేయాలని కూడా టీటీడీ నిర్ణయించింది.
తిరుమలకు తాగునీటి సరఫరా మెయింటెన్స్‌ కోసం 10 కోట్లు కేటాయించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ విధానాన్ని కమిటీ ద్వారా పరిశీలన జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version