చైనా యాప్ టిక్‌టాక్‌ను ఫోన్ల నుంచి డిలీట్ చేయాలని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగులను ఆదేశించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ ఈమెయిల్ తెలిపింది. భారత్‌లో టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్స్ ను ఇప్పటికే నిషేధించగా, అమెరికా కూడా నిషేధం గురించి ప్రకటించడంతో అమెజాన్ అప్రమత్తమైంది. అమెరికా అధికారికంగా టిక్‌టాక్‌ను నిషేధిస్తూ ప్రకటన చేయకముందే యాప్ డిలీట్ చేయాలని ఆదేశించింది.
అయితే అమెజాన్ ల్యాప్ టాప్‌లో మాత్రం టిక్ టాక్ బ్యాన్‌కు సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా 8.4 లక్షలమంది ఉద్యోగులతో అతిపెద్ద ప్రైవేటు సంస్థ అయిన అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో టిక్‌టాక్ కు గట్టి షాక్ తగలబోతుందని తెలుస్తుంది. భారత భూభాగమైన తూర్పు లడఖ్‌కు సమీపంలోని గాల్వాన్ లోయలో భారత్ – చైనా బలగాల మధ్య జరిగిన వివాదమే ఇందుకు కారణం.