బాలకృష్ణ తానా అంటే తందానా అంటున్నాడని.. వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీఆర్ పై చెప్పులు వేయటం కరెక్ట్ అని బాలకృష్ణ చెప్పటం ఎంత దౌర్భాగ్యమని ఏపీ మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మరణించి ఉండకపోతే మీ బతుకు ఏమయ్యి ఉండేదని.. మీ స్నేహితుడు ఎవరని అడిగితే రాజశేఖరరెడ్డి, నేను కలిసి తిరిగే వాళ్ళం అని చెప్పాడన్నారు. రాజశేఖరరెడ్డి కుటుంబం అప్పటికే ధనవంతులు.. రాజశేఖరరెడ్డి వెంట తిరుగుతూ ఖర్చుల కోసం చంద్రబాబు డబ్బులు తీసుకునే వాడని.. ఆ విషయాన్ని చంద్రబాబు ఎందుకు చెప్పడు?? అని నిలదీశారు.
లోకేష్ ఒక బఫూన్, అసమర్థుడు.. 27 ఏళ్ళ కిందట చేసిన వెన్నుపోటు రక్తపు మరకలను బావ, బావమరుదులు కలిసి తుడిచే ప్రయత్నం చేశారని ఆగ్రహించారు. ఇంత వరకు ఒక్క రాజకీయ నాయకుడు హాజరుకాని టాక్ షోకు చంద్రబాబు తన రాజకీయంగా పనికి వస్తుందేమో అని హాజరయ్యారన్నారు. పోగాలం దాపురించటంతోనే కుమారుడితో కలిసి టాక్ షో లో హాజరయ్యారు.. మూడు గంటలు కాళ్ళు పట్టుకుని బతిమాలినా ఒప్పుకోలేదు అందుకే జుట్టు పట్టుకుని లాగేశాను అనే విధంగా చంద్రబాబు మాట్లాడటం ఎంత ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.