చంద్రబాబువి దొంగ మాటలు, చీటింగ్ వ్యవహారాలు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తిరుపతిలో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయం లో, జరిగిన అన్యాయం పై పవన్ కల్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదు. పవన్, చంద్రబాబు చేస్తున్న అకృత్యాలను బయటకు చెప్పలేడు. గతం లో ప్రజాస్వామ్యం అని ఊగి పోయే పవన్ ఇప్పుడు ఎందుకు మౌనం గా ఉంటున్నాడు. బుడమేరు వరదల పేరుతో దొంగ లెక్కలు రాసిన వారిని వదలం. చట్ట పరంగా పోరాటం చేస్తాం.. 9కోట్ల స్కాంను బయట పెడతాం అని అన్నారు.
అలాగే మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మా వైపు నిలబడిన 24 మంది కార్పొరేటర్ లను అభినందిస్తున్నాను. పార్టీ ఫిరయింపుల కు పాల్పడిన కార్పొరేటర్ ల పై న్యాయ పోరాటం చేస్తాం. కేంద్ర మంత్రి పెమ్మసాని కి వేటాడటం తెలిస్తే, అడవిలోకి వెళ్లి వెటాడుకోమనండి. గుంటూరు కార్పొరేషన్ లో అవిశ్వాసం పెట్టినా టిడిపి వాళ్ళు ఏం చేయలేరు. ఐదేళ్లు వైసిపి వాళ్ళే మేయర్, డిప్యూటీ మేయర్ లుగా ఉంటారు అని అంబటి పేర్కొన్నారు.