ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తరచూ విమర్శలు చేసే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అంబటి రాంబాబు అన్నారు. అంతేకాకుండా సినిమా భారీ కలెక్షన్లను రాబట్టి కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను అంటూ ఆయన ఎక్స్ వేదికగా రాసుకోచ్చారు.

దీనికి పవన్ కళ్యాణ్, నాగబాబును ట్యాగ్ చేశారు. అయితే ఇది కూడా సెటైర్ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడు విమర్శలు గుప్పించే అంబటి రాంబాబు ఇప్పుడు ఇలా కోరుకోవడం అసాధ్యమని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ హరిహర వీరమల్లు సినిమా రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే థియేటర్ల వద్ద భారీ సందడి నెలకొంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలలో కూడా ఫుల్ బిజీగా గడుపుతున్నారు.