హరిహర వీరమల్లు రిలీజ్.. మంత్రి లోకేష్ షాకింగ్ ట్వీట్

-

హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా సినిమా టీమ్ కు మంత్రి లోకేష్ స్పెషల్ విషెస్ చెప్పారు. మా పవన్ అన్న సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులే కాదు నేను కూడా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. పవన్ అన్న, ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం అని చెప్పాడు.

nara lokesh, hari hara veera mallu
Harihara Veeramallu release Minister Lokesh’s shocking tweet

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పెర్మార్మెన్స్ తో హరిహర వీరమల్లు అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు మంత్రి లోకేష్. కాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తరచూ విమర్శలు చేసే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అంబటి రాంబాబు అన్నారు.

అంతేకాకుండా సినిమా భారీ కలెక్షన్లను రాబట్టి కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను అంటూ ఆయన ఎక్స్ వేదికగా రాసుకోచ్చారు. దీనికి పవన్ కళ్యాణ్, నాగబాబును ట్యాగ్ చేశారు. అయితే ఇది కూడా సెటైర్ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడు విమర్శలు గుప్పించే అంబటి రాంబాబు ఇప్పుడు ఇలా కోరుకోవడం అసాధ్యమని కొంతమంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news