ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా లో ఒక అభ్యర్థి భర్త చనిపోయారని, అక్కడికి ఆవిడని పరామర్శించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ స్వయంగా వెళ్ళటం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. అక్కడికి వెళ్తున్న నారా లోకేష్ కు పైలెట్ గా వెళ్ళారా? అని అయన ప్రశ్నించారు. అలానే కుక్క పని కుక్క చేయాలి…గాడిద పని గాడిద చేయాలి అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
అచ్చెన్నాయుడు బలవంతపు ఏకగ్రీవం పై ఎందుకు నిమ్మగడ్డ నోరు విప్పటం లేదు? అని అంబటి ప్రశ్నించారు. అంతే కాక ఈ-వాచ్ యాప్ ఒక బూటకం అని ఆరోపించిన ఆయన దానిని టీడీపీ ఆఫీసులో తయారు చేశారని అన్నారు. ప్రభుత్వ యాప్ లు ఉండగా ప్రత్యేకంగా, రహస్యంగా ఈ-వాచ్ యాప్ నిమ్మగడ్డ తీసుకుని రావడం వెనుక ఉన్న కారణాలు ప్రజలకు తెలియాలని అంబటి డిమాండ్ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అనుమతి లేకుండా ఎస్ఈసీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించటం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. యాప్ పై మాకు అనుమానాలు ఉన్నాయన్న అంబటి అందుకే కోర్టు ను ఆశ్రయించామని అన్నారు.