కోట్లు ఖర్చు పెట్టీ చేసిన దావోస్ పర్యటన తుస్ అయ్యింది. దావూస్ పర్యటన చేస్తే పెట్టుబడులు రావాల అంటూ బుకాయిస్తున్నారు అని అంబటి రాంబాబు అన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ కి నా ఇంటి కుక్క కూడా భయ పడదు. ఎన్ని కేసులు పెట్టిన వైసిపి శ్రేణులు భయ పడరు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చక పొతే చూస్తూ ఊరుకోం. ప్రతి పక్షం గా వెంటాడి పోరాడతాం.
ఉచిత గ్యాస్ సిలిండర్ ల పథకం తప్ప సూపర్ సిక్స్ పతకాలు అమలు కావడం లేదు. విజయ సాయి రెడ్డి, రాజీనామా ఆయన వ్యక్తిగతం …రెడ్ బుక్ కి భయ పడే వ్యక్తి కాదు విజయ సాయి రెడ్డి. అప్రువర్ గా మారమని విజయ సాయి రెడ్డి పై ఒత్తిడి తెచ్చిన నాయకులు ఎవరో తేలాలి. జగన్ మీద ఆధారాలు లేకుండా కేసులు పెట్టారని ప్రజలకు అర్థం ఐపోయింది. చంద్రబాబు కి సలహా ఇచ్చే శక్తి ఎవరికీ లేదు.. ఒక్క లోకేష్ కి తప్ప. చంద్రబాబు మాత్రం ప్రధాని మోడీ తో సహా,పక్క రాష్ట్రాల్లో ఉన్న సిఎం ల కు కూడా సలహాలు ఇస్తారు. అభూత కల్పననలు దుర్మార్గపు ఆలోచనలు తప్ప చంద్రబాబు కి ఏం తెలియదు అని అంబటి విమర్శించారు.