53 వేల కిలోమిటర్ల NDB రోడ్లు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 65 శాతం పనులు పూర్తి అయ్యాయి అని రోడ్లు భవనాలశాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అన్నారు. 2014 – 19 మధ్యలో మాత్రమే రోడ్ల పనులు జరిగాయు. గత ప్రభుత్వ హయంలో 7334 కోట్లు మాత్రమే పనులు జరిగాయి. ఇప్పుడు రాష్ట్రంలో 1061 కోట్ల మరమత్తుల పనులు చేపట్టాం. అందులో ఇప్పటి వరకు 65 శాతం పనులు పూర్తి అయ్యాయి. 12,200 కిలో మీటర్ల పనులు పూర్తి చేశాము అని పేర్కొన్నారు.
అలాగే జంగిల్ క్లియరెన్స్ కూడా చేసి పనులు చేస్తున్నాం. గతంలో మన రోడ్లు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి చూసారు. వైసిపి ప్రభుత్వ హయంలో మన రోడ్లపై పక్క రాష్టాలు జోకులు కూడా వేశాయి. మోత్తం 3014 కోట్లుతో పనులు చేస్తున్నాం. 94 కోట్లు ఏలూరు జిల్లాకు కేటాయించాం. రాష్ట్రంలో గుంతలు లేని లేని రోడ్లు లక్ష్యంగా పని చేస్తున్నాం. NDB రోడ్లు పనులను వచ్చేనెల చివరి నాటికి పూర్తి చేస్తాం. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు చేస్తాం అని మంత్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.