CM KCR కు నేను పెద్ద ఫ్యాన్ – అంబటి రాయుడు

-

సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్ 3 లాంచ్ లో క్రికెటర్ అంబటి రాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భం గా క్రికెటర్ అంబటి రాయుడు తెలుగులో మాట్లాడి.. అందరినీ ఆశ్చర్య పరిచాడు. CM KCR కు నేను పెద్ద ఫ్యాన్ అంటూ క్రికెటర్‌ అంబటి రాయుడు కామెంట్‌ చేశాడు.

సిద్దిపేటకి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 10 ఏళ్లలో ఇండియాలో జరగని అభివృద్ధి సిద్దిపేటలో జరిగిందని వివరించారు. ఇండియా టీం లో తెలుగు వాళ్ళు చాలా మంది ఆడాలన్నారు. సిద్దిపేటలో క్రికెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించాలి అని మంత్రి హరీష్ రావు గారిని కోరుకుంటున్నానని చెప్పారు క్రికెటర్ అంబటి రాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version