మాజీ టీం ఇండియా ప్లేయర్ అంబటి రాయుడు క్రికెట్ ను పూర్తిగా తన జీవితం నుండి తీసేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మరియు ఐపీఎల్ ల నుండి తప్పుకోగా, ఇక అంతర్జాతీయ లీగ్ లలో ఆడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ మధ్యనే వెస్ట్ ఇండీస్ లో మొదలైన కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో సెయింట్ కీట్స్ అండ్ నేవీస్ పాట్రియాట్స్ తరపున బరిలోకి దిగాడు. కానీ సీజన్ మొదలైన తర్వాత కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడి తర్వాత కనుమరుగయ్యాడు. ఎందుకని చూస్తే… వ్యక్తిగత కారణాల వలన కరేబియన్ లీగ్ నుండి నిష్క్రమించాడు. ఇక స్థానికంగా వినిపిస్తున్న ప్రకారం అంబటి రాయుడు పొలిటికల్ గా మరింత స్ట్రాంగ్ కావడానికి సమాయత్తం అవుతున్నాడు.
నిలకడలేని అంబటి రాయుడు … CPL నుండి అవుట్ !
-