అంబటి వర్సెస్ జనసేన..లంచాల బాగోతం..రాజీనామాకు రెడీనా.!

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని ఎక్కువగా టార్గెట్ చేసి..ఆయన కోసమే ప్రెస్ మీట్లు తిట్టే మంత్రుల్లో అంబటి రాంబాబు కూడా ఒకరు. ఇక అంబటి మంత్రిగా ఏ శాఖకు సంబంధించింది పనిచేస్తున్నారో జనాలకు పెద్దగా క్లారిటీ లేదు గాని..ఆయన మంత్రిగా ఉన్నది పవన్‌ని తిట్టడం కోసం అని చెప్పి జనాలు గట్టిగా అనుకుంటున్నారు. ఇక పవన్ ఎప్పుడో ఒకసారి వచ్చి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే చాలు దాన్ని పట్టుకుని అంబటి వారమంతా ప్రెస్ మీట్ పెట్టి పవన్‌ని విమర్శిస్తారని జనసేన శ్రేణులు అంటున్నాయి.

తాజాగా పవన్..సత్తెనపల్లి వెళ్ళి అక్కడ కౌలు రైతులకు ఆర్ధిక సాయం చేసి..అంబటిపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. చనిపోయిన కౌలు రైతులకు ఇచ్చే చెక్‌ల్లో అంబటి లంచాలు అడుగుతున్నారని ఆరోపించారు. ఇక తనపై ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అంబటి సవాల్ కూడా విసిరారు. ఇదే క్రమంలో తురకా గంగమ్మ అనే కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5లక్షల పరిహారం వచ్చింది. అందులో సగం ఇవ్వాలంటూ అంబటి డిమాండ్ చేసినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ‘‘ఛీ….మీరు పాలకులా’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

అలాగే దీనిపై జనసేన నాయకులు కూడా భగ్గుమన్నారు. ‘అయ్యా అంబటి ఎక్కడ దాక్కున్నావ్.. ఎక్కడికి పారిపోయావు. లంచం డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా అన్నావు. ఇదిగో నీ లంచాల బాగోతం నిరూపించాం. ఎప్పుడు రాజీనామా చేస్తావో చెప్పు’ అంటూ జనసేన నేతలు ఫైర్ అయ్యారు. గంగమ్మ కుటుంబానికి అన్యాయం చేశావని, తక్షణమే వారికి చెక్ ఇవ్వాలని లేదంటే ఆర్డీవో ఆఫీసు దగ్గర ధర్నా చేస్తామని అన్నారు. గంగమ్మ కుటుంబానికి ఏమైనా జరిగితే అంబటిదే బాధ్యత అని జనసేన నేతలు వార్నింగ్ ఇచ్చారు. అసలు సి‌ఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులు ఇప్పించిందే తాను అని, అలాంటిది తాను ఎందుకు లంచం డిమాండ్ చేస్తానని, మృతుల పరిహారంలో వాటా తీసుకునే దౌర్భగ్యం లేదని ఫైర్ అయ్యారు. మొత్తానికి జనసేన మాత్రం అంబటిని గట్టిగా టార్గెట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version