Ambedkar Jayanti: అంబేద్కర్ జీవితం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు..

-

ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బీమ్ రావ్ అంబేడ్కర్ జయంతి…కుల వివక్ష లేకుండా అందరికి సమాన హక్కులు ఇవ్వాలి అంటూ పోరాడటమే కాదు.. భావి తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా రాజ్యాంగాన్ని రచించారు.. ఇప్పుడు అదే అందరూ ఫాలో అవుతున్నారు..ఈ రోజు దేశ వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు మిన్నంటాయి..డా. బీ. ఆర్ అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో జన్మించారు. దళిత వర్గానికి చెందిన ఆయన తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దళితుడైన కారణంగా అంబేడ్కర్ను అంటరానివాడిగా చూసేవారు. స్కూల్కు వెళ్లినా వేర్వేరుగా కూర్చోవల్సిన పరిస్థితి. ఒక్కోసారి క్లాస్రూమ్లోనే కూర్చోనిచ్చేవారు కాదు. ఇన్ని కష్టాల మధ్య అంచెలంచెలుగా ఎదిగిన అంబేడ్కర్.. ఒక గొప్ప ఎకనామిస్ట్గా, జ్యూరిస్ట్గా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి నాయకత్వం వహించిన ఘనత అంబేడ్కర్ సొంతం. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన గురించి పలు ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం…

అంబేద్కర్ తన తల్లీ దండ్రులకు 14 వ సంతానం.. పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేడ్కర్. బీ. ఆర్ అంబేడ్కర్ అసలు ఇంటి పేరు అంబావాడేకర్. ఆ పేరును అంబేడ్కర్గా మార్చారు ఆయన టీచర్ మహదేవ్ అంబేడ్కర్. ఇక.. త్రివర్ణ పతాకాన్ని రూపొందించింది పింగళి వెంకయ్య అన్న విషయం తెలిసిందే. అయితే.. జెండాలోకి అశోక చక్ర.. బీ.ఆర్ అంబేడ్కర్ వల్లే వచ్చిందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. నోబెల్ బహుమతి పొందిన ప్రొఫెసర్ అమర్త్య సేన్.. అంబేడ్కర్ను ‘ఫాథర్ ఆఫ్ ఎకనామిక్స్’గా సంబోధించారు.. అలా చరిత్రను సృష్టించారు..

64 సబ్జెక్ట్లలో మాస్టర్స్ డిగ్రీ ఉంది. హిందీ, పాలీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, గుజరాతీ వంటి భాషల్లో ఆయను ప్రావీణ్యం ఉంది. వీటితో పాటు దాదాపు 21ఏళ్ల పాటు.. ప్రపంచంలోని అన్ని మతాల గురించి చదివారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో 8ఏళ్ల కోర్సును కేవలం 2 ఏళ్ల 3 నెలల్లో పూర్తి చేశారు..కాగా,లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ‘డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్సెన్స్’ పీహెచ్డీ పొందిన మొదటి, ఏకైక వ్యక్తి అంబేద్కర్..అంబేద్కర్ దేశంలోని వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక అన్యాయాలను నిరసించాడు. దళితులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన తన ప్రముఖ వ్యాసం- ‘నో ప్యూన్, నో వాటర్’ లో ఎత్తిచూపారు.. దాంతో దళిత హక్కుల పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం మార్చి 31, 1995 న అట్రాసిటీ నిరోధకచట్టాన్ని రూపొందించింది…

అంబేద్కర్ 1947 ఆగస్టు 29 నుండి జనవరి 24, 1950 వరకు భారతదేశానికి న్యాయ మంత్రిగా పనిచేసిన కాలంలో జనవరి 26, 1650 నుండి అమల్లోకి వచ్చిన దేశ రాజ్యాంగాన్ని రూపొందించినందున అంబేద్కర్ ‘భారత రాజ్యాంగ పితామహుడు’ అని కూడా పిలుస్తారు.అంబేద్కర్ 1951లో ఫైనాన్స్ కమీషన్ ఆఫ్ ఇండియాను స్థాపించారు.. ఆర్బీఐ ను స్థాపించడానికి పునాది వేశారు.. ఇలా ఎన్నో ఆయన సారద్యం లో జరిగాయి.. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనను స్మరించుకుందాం..

Read more RELATED
Recommended to you

Latest news