ఆయన ఎందుకు దాని గురించి మాట్లాడతారు అనుకుంటున్నారా…? అవును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పౌరసత్వ సవరణ చట్టాన్ని తప్పుబట్టారు. తన ప్రసంగంలో మోడీని కీర్తిస్తున్నట్టే కీర్తించిన ఆయన భారత దేశ గొప్పతనాన్ని కాస్త తనదైన శైలిలో చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అది కూడా చాలా జాగ్రత్తగా చెప్పారు ట్రంప్. ఎక్కడా కూడా నొప్పించకుండా ప్రసంగం చేసారు ట్రంప్.
“వేల ఏళ్లుగా ఇక్కడ హిందువులు, ముస్లింలు, జైనులు, సిక్కులు పరస్పరం సామరస్యంగా మెలుగుతున్నారు. కలిసి ప్రార్థనలు చేసుకుంటున్న దేశమిది” అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసారు. వాస్తవానికి పౌరసత్వ సవరణ చట్టం విషయంలో తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా దీనిపై తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో మాట్లాడిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇక మోడీ గురించి ప్రత్యేకంగా ట్రంప్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసారు. మోడీ ఎవరి మాట అంత సులువుగా వినరని, ఆయన మొండిఘటం అన్నారు. ఇక మోడీ ఎదిగిన తీరుని అమెరికా అధినేత ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ జాతీయవాదాన్ని ఉద్దేశిస్తూ ట్రంప్ ప్రత్యేకంగా పరోక్ష వ్యాఖ్యలు చేసారు. మంగళవారం సాయంత్రం ట్రంప్ తిరిగి అమెరికా వెళ్ళిపోతారు.