అమెరికాను వణికిస్తున్న హరికేన్​ హన్నా

-

కరోనా వైరస్​ ఉద్ధృతితో ఇబ్బందులు పడుతున్న అమెరికాను హరికేన్​ హన్నా వణికిస్తోంది. రెండోసారి తీరం దాటిన ఈ తుఫాను.. టెక్సాస్ తీరప్రాంతంలో పెను గాలులకు కారణమైంది. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అమెరికా ప్రకటించిన వివరాల ప్రకారం..అమెరికా టెక్సాస్​లో హన్నా తుపాను శనివారం మరోసారి తీరం దాటింది. అట్లాంటిక్​ సముద్రంలో ప్రారంభమైన హరికేన్​ హన్నా.. వాయువ్య దిశకు 15 మైళ్ల దూరంలో సాయంత్రం 6:15 గంటలకు తూర్పు కెనడీ కౌంటీలో రెండోసారి తీరం దాటింది. ఈ తుపాను ప్రభావంతో అక్కడ ప్రచండగాలులు వీచాయి.

America

ఇప్పటికే కరోనా వైరస్​ ప్రభావంతో అతలాకుతలమైన అమెరికాలోని టెక్సాస్​లో.. హరికేన్​ తుపానుతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గరిష్ఠంగా 90 మైళ్ల (145 కిలోమీటర్లు) వేగంతో గాలులు వీచాయి. నది ఒడ్డున నిలిపిన పడవలు.. అలల తాకిడికి ధ్వంసమయ్యాయి. భారీ వర్షం, తుఫాను కారణంగా టెక్సాస్​లోని తీరప్రాంతం దెబ్బతింది.ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించిన స్థానిక అధికారులు.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version