పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెడుతున్నారనే కథనాలు వచ్చిన కొత్తలో “మార్పు” రావొచ్చని, కచ్చితంగా “ప్రశ్నిస్తారు” అని అంతా నమ్మిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో టీడీపీకి మద్దతు తెలిపడానికి.. ఫలితాల అనంతరం పవన్ ను తమ్ముళ్లు లైట్ తీసుకోవడానికి.. బాబు నీడన మరో మొక్క ఎదగదన్న విషయం తెలుసుకోవడానికి పెద్ద ఎక్కువ సమయమేమీ పట్టలేదు! అనంతరం కాస్త గ్యాప్ తీసుకుని, బీజేపీతో జతకట్టారు పవన్!!
ప్రస్తుతం బీజేపీతో దోస్తీ బాగనే ఉన్నట్లుంది పవన్ కి! పైగా ఏపీ నుంచి బీజేపీకి బలమైన నేత ఎవరూ లేరు అని నమ్ముతున్న పవన్.. ఆ దిశగా అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఇంతకాలం పవన్ కి ఉన్న “రాజకీయాల్లో( చంద్రబాబు దత్తపుత్రుడు పవన్”, “టీడీపీ తోకపార్టీ జనసేన”, “బాబు కనుసన్నాలో నడిచే పవన్”, “బాబు అనుమతి లేకుండా అర్ధ అక్షరం కూడ అపలకని పవన్” వంటి పేర్లను చెరిపేసుకోవడానికి పవన్ తీవ్రంగా కృషిచేస్తున్నారు!
గతకొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టాల్సి వచ్చిన ప్రతిసారీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా విమర్శలు గుప్పిస్తోన్న పవన్ అదేసమయంలో… “టీడీపీకి పవన్ డబ్బింగ్ చెబుతున్నారు” అన్న విమర్శ రాకుండా… “గత ప్రభుత్వం” అంటూ చంద్రబాబుని కూడా ఏకి పారేస్తున్నారు.. తీవ్రంగా విమర్శిస్తున్నారు! విమర్శలు చేసే విషయంలో తాను వైకాపా – టీడీపీలకు ఏలాంటి మిత్రుడినీ కాదనే సంకేతాలు ప్రజలకు ఇవ్వడానికి తెగ ఆరాటపడుతున్నారు!
మొన్నటికి మొన్న అమరావతిలో రాజధాని ఉండాలని, రైతులను ఇబ్బంది పెట్టొద్దని జగన్ ను డిమాండ్ చేసిన పవన్… అనంతరం అమరావతిలో రాజధాని రైతులు పడుతున్న ఇబ్బందులకు చంద్రబాబు వైఖరే కారణమని తెలిపారు. ఇదే క్రమంలో తాజాగా ఏపీలో ఇసుక దొరకడం లేదన్న విమర్శకూ బాబును జతచేశారు పవన్. “రాష్ట్రంలో ఇసుక ఒక అందని ద్రాక్షగా మారిపోయింది. అందనంత దూరంలోకి వెళ్లిపోయింది. అసలు ఇసుక ఎవరికి వెళ్తుందో కూడా తెలియడంలేదు. ఇదేవిధంగా జరిగితే టీడీపీకి తగిలినట్లే వైసీపీకీ ఇసుకదెబ్బ తగిలి తీరుతుంది” అంటూ పవన్ వ్యాహ్యానించారు!!
ఈ విధంగా తాను టీడీపీ – వైకాపాలలో ఎవరికీ తోకను కాదని, తాను బీజేపీకి మాత్రమే డబ్బింగ్ చెబుతాను కానీ.. ఆ రెండు పార్టీలకు కాదని పవన్ తేల్చి చెప్పినట్లయ్యింది!! దీంతో… “బాబు అనుచరుడు పవన్” అన్న్న పాత పేరును పవన్ తొలగించేసుకోబోతున్నారన్న మాట!! ఇక కొత్త పేరంటే… కాషాయ మిత్రుడు.. మోడీ శిష్యుడు.. మొదలైనవన్నమాట!!