అమెరికాలో కొత్త బిల్లు…వాళ్ళందరూ జైలుకే…!!!

-

ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ అనేది  అందరికి శరీరంలో ఒక అవయవంలా మారిపోయింది. చెయ్యి, కాలు లేకపోతే ఎలా కుమిలిపోతామో సెల్ ఫోన్ లేక పొతే అంతకంటే ఎక్కువగా బెంగ పెట్టేసుకుని మంచం ఎక్కేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది తల్లితండ్రులు సరదాకి ఈ ఫోన్ అలవాటు చేస్తుంటే అది చివరికి వారి కొంపలు ముంచుతోంది. సెల్ ఫోన్ మాట్లాడుతూ కొండపై నుంచీ పడిపోయి చనిపోయిన వాళ్ళు కొంతమందైతే, మరి కొంతమంది తప్పుడు మార్గాలలో పయనిస్తూ క్రిమినల్స్ గా మారిపోతున్నారు. ముఖ్యంగా ఈ రకమైన ధోరణి చిన్న యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఇబ్బందులు ఎదుర్కుంటున్న తల్లి తండ్రులు ఈ ఫోన్ ని బ్యాన్ చేసేస్తే బాగుండు అనే పరిస్థతికి వచ్చేశారు…అయితే

ఈ రకమైన పరిస్థితులకి చెక్ పెట్టింది అమెరికాలోని వెర్మంట్ రాష్ట్రం. తమ రాష్ట్రంలో ఎంతో మంది యువత చెడు మార్గాలలో పయనించడానికి ప్రధానమైన కారణం సెల్ ఫోన్ అని సర్వే చేయించుకుని మరీ నిర్ధారించుకున్న జాన్ రోడ్జర్స్ అనే  సెనేటర్ ఈ పరిస్థతిని మార్చాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఎస్.212 అనే పేరుతో ఓ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సారాంశం ఎమింటే..

 

21 ఏళ్ళ లోపు యువత ఎవరైనా సరే స్మార్ట్ ఫోన్ వాడితే వారిని ఇకపై కటకటాల వెనక్కి నెట్టుతారాట. అంతేకాదు వారికి 70 వేల రూపాయల ఫైన్ తో పోటు కటినమైన జైలు జీవితం కూడా అనుభవించాల్సి వస్తుందని తెలిపారు. ఈ బిల్లు ప్రవేశపెట్టగానే ఒక్కసారిగా సభ మొత్తం హర్ష ద్వానాలతో మారుమోగింది. అందరూ ఈ బిల్లుకి ఆమోదం తెలిపారు. అయితే ఈ బిల్లుని కొందరు వ్యతిరేకిస్తున్నా మెజారిటీ ప్రజలు ఈ బిల్లుని స్వాగతిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version