బ్రేకింగ్; పృథ్వీపై దాడి…!

-

రాజీనామా అనంతరం హాస్య నటుడు పృథ్వీ మీడియా సమావేశ౦ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. తన మీద తెలుగుదేశం నేతలు కుట్ర చేసారని ఆయన అన్నారు. తాను రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ లు అని అనలేదని వ్యాఖ్యానించారు. తాను కార్పోరేట్ రైతులనే తిట్టాను అన్నారు. అసలు రైతులపై చేసిన వ్యాఖ్యలు ఇంత వివాదాస్పదం అవుతాయని అనుకోలేదని పృథ్వీ చెప్పుకొచ్చారు.

తనను కొందరు దెబ్బ కొట్టాలని చూసారన్నారు. జగన్, సుబ్బారెడ్డికి దగ్గరవుతున్నా అనే తనపై కుట్రలు చేశారన్నారు. రైతులపై నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్ళు పార్టీ కోసం పని చేసాను అని ఆయన చెప్పుకొచ్చారు. అమరావతిలో తాను కార్పోరేట్ తనను తాగుబోతు అని అన్నారని, తాను తాగుబోతుని కాదని, కావాలంటే టెస్ట్ చేసుకోవాలని సవాల్ చేసారు.

తిరుమలలో అన్యమత ప్రచారాన్ని తాను ముందు నుంచి వ్యతిరేకిస్తున్నా అన్నారు. 1989 నుంచి తాను వైఎస్ కుటుంబంతో ఉన్నారు అన్నారు. నా పని చూసి జగన్ ఎస్వీ బీసి చైర్మన్ పదవి ఇచ్చారు అన్నారు. తాను మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు అన్నారు. తనపై విచారణ చేసుకోవాలని ఆయన సవాల్ చేసారు. తానే టీటీడీ విజిలెన్స్ ని విచారణ చేయాలని కోరుతున్నా అన్నారు.

విచారణ పూర్తి అయిన తర్వాతే ఎస్వీబీసీలో అడుగు పెడతా అన్నారు. ఈ నెల 10 న తనపై దాడి జరిగిందని, కొందరు పిడి గుద్దులు గుద్ది వెళ్లిపోయారని ఆయన అన్నారు. రైతుల కష్టాలు తనకు తెలుసు అన్నారు. నిజమైన రైతులకు తాను క్షమాపణ చెప్తాను అన్నారు. పార్టీ అధ్యక్షుడి మాటను గౌరవించాలి కాబట్టి రాజీనామా చేస్తున్నా అన్నారు. తన మీద కుట్ర చేసిన విపక్షాలకు సెల్యూట్ అన్నారు.

తన గురించి పోసాని ఎందుకు మాట్లాడారో తెలియదు అన్నారు. సంక్రాంతి సమయంలో తన కుటు౦బం కన్నీళ్లు పెట్టుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తాను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, రేపటి నుంచి కడిగిపారేస్తా అంటూ స్పష్టం చేసారు. తనను నియంత అన్నారని తాను ఎం చేశా అని ప్రశ్నించారు. పోసాని అసలు తన గురించి ఎందుకు మాట్లాడారో తెలియదు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version