అమెరికా మరోసారి తన అగ్రరాజ్యం బలుపును చూపెట్టుకుంది. ఇండియా తన మిత్రుడుగా చెప్పుకుని తిరిగే అధ్యక్షుడు ట్రంప్.. సొంత దేశ మీడియా ఇండియా మీద అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నా ఆయన అడ్డుచెప్పడం లేదని సమాచారం. అయితే, భారత్, పాక్ మధ్య సయోధ్య తానే కుదిర్చానని గొప్పలకు పోతోంది అమెరికా.
సీజ్‌ఫైర్ క్రెడిట్ కొట్టేసేందుకు తెగ తాపత్రయం పడుతున్నది. ఎంతో కష్టపడి ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేలా చేశామంటూ యూఎస్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుండగా.. ఓ వైపు పాకిస్తాన్‌ను ఆకాశానికెత్తేస్తూ, భారత్‌ను అవమానపరిచేలా సంచలన వ్యాఖ్యలు చేస్తోంది అమెరికన్ మీడియా. కాల్పుల విరమణ కోసం అమెరికాను భారత్ ప్రాధేయపడిందంటూ అక్కడి మీడియా ప్రసారాలు చేస్తుంది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.