ఇటీవలి కాలంలో కొందరు ఓవర్ నైట్ ఫేమస్ అయ్యేందుకు పిచ్చిపిచ్చి వేశాలు వేస్తున్నారు. కొందరు వెలికి చేష్టలకు పాల్పడుతుంటే మరికొందరు ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రాంక్ వీడియోలు చేస్తున్నారు. ఇంకొందరు ఏకంగా తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఓ యువకుడు రన్నింగ్ ట్రైన్ టైంలో ట్రాక్ మీద బోర్లా పడుకున్నాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ‘ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం!. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా!? ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు.. ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి’ అంటూ రాసుకొచ్చారు.
ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం!
సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా!?
ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు.. ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి. pic.twitter.com/GF8PDKdqAf
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 11, 2025