దేశం కోసం ప్రాణాలర్పించాడు మరో సైనికుడు. పాక్ కాల్పుల్లో రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ వీర మరణం పొందాడు. జమ్మూకశ్మీర్ ఆర్ఎస్ పురా సెక్టార్ లో పాక్ దుశ్చర్యకు అమరుడయ్యాడు సునీల్ కుమార్. సునీల్ కుమార్ స్వస్థలం జమ్మూలోని ట్రెవా గ్రామం అని పేర్కొన్నారు అధికారులు.

అమరుడైన జవాను మృతదేహాన్ని ఆయన నివాసానికి తీసుకొచ్చారు సహచర సైనికులు. సునీల్ కుమార్ మృతదేహం చూసి కన్నీటిపర్యంతమయ్యారు కుటుంబ సభ్యులు. అటు పాక్ కాల్పుల్లో మరో భారత్ అధికారి మృతి చెందాడు. సరిహద్దులో జరిగిన కాల్పులలో.. బీఎస్ఎఫ్ ఎస్సై వీర మరణం పొందారు. జమ్మూలోని ఆర్ఎస్ పుర ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దులో కాల్పులు జరిగాయి. జమ్మూలోని ఆర్ఎస్ పురా ప్రాంతంలోని సరిహద్దు వద్ద పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో బిఎస్ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎండి ఇంత్యాజ్ మృతి చెందారు.