కీలక రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో ఓట్ల లెక్కింపు ప్రకటనను అడ్డుకోవడానికి డోనాల్డ్ ట్రంప్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు అన్యాయం జరిగింది అని, ఆయన సుప్రీం కోర్ట్ కి వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయనకు సుప్రీంకోర్టు మంగళవారం షాక్ ఇచ్చింది. తొమ్మిది మంది న్యాయమూర్తులను కలిగి ఉన్న దేశ అత్యున్నత న్యాయస్థానం… ట్రంప్ వాదనలు వినలేదు.
నవంబర్ 3 ఎన్నికలు జరిగిన నెల తర్వాత కూడా ట్రంప్ ఆరోపణలు చేసారు. తనను మోసం చేసారు అని ఆయన కీలక రాష్ట్రాల్లో డజన్ల కొద్దీ వ్యాజ్యాల దాఖలు చేసారు. తాజాగా సుప్రీం కోర్ట్ కూడా ఆయన పిటీషన్ కొట్టేసింది. పలు కీలక రాష్ట్రాల విషయంలో కూడా ట్రంప్ కోర్ట్ కి వెళ్ళగా అనుకున్న విధంగా ఆయనకు నిర్ణయాలు రాలేదు.