నేరేడ్ మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. న్యూ సైన్సు కాలేజిలో లెక్కింపు జరిగింది. నేరేడ్‌మెట్ డివిజన్‌లో ముందు మొత్తం 25,136 ఓట్లకు గాను, 24,612 ఓట్లను లెక్కించిన అధికారులు ఇతర గుర్తులు ఉన్న 544 ఓట్లను మాత్రం లెక్కించకుండా పక్కన పెట్టారు అధికారులు. కోర్టు ఆదేశాల ప్రకారం ఈరోజు 544 ఓట్లను లెక్కించగా అందులో టిఆర్ఎస్ అభ్యర్థికే ఆధిక్యత వచ్చింది. న్నికల పరిశీలకులు సీనియర్ ఐఏఎస్ మానిక్ రాజ్ సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగింది.
కౌంటింగ్ లో టిఆర్ఎస్ అభ్యర్థి మీనా రెడ్డికి 278 వోట్లు లభించడంతో ఆమె గెలిచినట్టు అయింది. అయితే ఆర్వోదే తుది నిర్ణయం, కాగా ఇప్పటి దాకా రిజల్ట్ ప్రకటించలేదు. ప్రస్తుతం 544 ఓట్ల లెక్కింపు మాత్రమే లెక్కించగా చెల్లని ఓట్లు 1300 కూడా కౌంట్ చేయాలని బీజేపీ అభ్యర్థి ఆందోళనకు దిగారు. బీజేపీ అభ్యర్థి ఏడుస్తూ ఎన్నికల సిబ్బంది ఏకపక్షంగా వ్యహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మరి ఆర్వో ప్రకటన కాసేపట్లో అధికారికంగా వెలువడే అవకాశం కనిపిస్తోంది.