ఇండియ‌న్స్ ఐఫోన్లు కొన‌లేర‌ట‌.. అమెరికా మ‌హిళ జాత్యహంకార వ్యాఖ్య‌లు..!

-

ప్ర‌పంచంలో ఉన్న ఏ దేశానికి వెళ్లినా విదేశీయుల‌కు అతిథి మ‌ర్యాద‌లు స‌రిగ్గా జ‌రుగుతాయో లేదో తెలియ‌దు కానీ.. మన దేశంలో మాత్రం అలా కాదు. మ‌న దేశానికి విదేశీయులు ఎవ‌రు వ‌చ్చినా భార‌తీయులు వారిని స‌రిగ్గానే ఆద‌రిస్తారు. అసలు ఇండియా అంటేనే అనేక ర‌కాల సంస్కృతులు, సంప్ర‌దాయాల క‌ల‌యిక‌. ఇక్కడి ప్ర‌జ‌ల‌కు ప్రేమించ‌డ‌మే తెలుసు. ద్వేషించ‌డం తెలియ‌దు. అనురాగంతో చేతులు చాస్తే ఆద‌రించి అక్కున చేర్చుకుంటారే కానీ ఆగ్ర‌హించ‌రు. అదే క‌ల‌హం పెట్టుకుంటే భార‌తీయులు త‌మ త‌డాఖా ఏంటో చూపిస్తారు. ఓ అమెరిక‌న్ పౌరురాలికి కూడా స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది. ఇంత‌కీ అస‌లు విషయం ఏమిటంటే…

కొలీన్ గ్రేడీ అనే ఓ అమెరిక‌న్ పౌరురాలు ఈ మ‌ధ్యే జైపూర్‌లో ఉన్న ఓ ఇండియ‌న్ ఫ్యామిలీ వ‌ద్ద‌కు వ‌చ్చింది. ఆమె ఓ ట్రావెల్ బ్లాగ‌ర్‌. ప్ర‌పంచంలోని ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో తిరుగుతూ అక్క‌డ తనకు క‌లిగిన అనుభ‌వాల గురించి త‌న బ్లాగ్‌లో రాస్తుంటుంది. అయితే జైపూర్‌లో ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే ఓ వీధిలో గ్రేడీ త‌న ఐఫోన్ X ఫోన్‌ను ఇటీవ‌లే పోగొట్టుకుంది. దీంతో ఆమె త‌న ఫోన్ పోయినందుకు మొత్తం భార‌తీయుల‌తోపాటు భార‌త‌దేశంపైనే అవ‌మాన‌క‌ర రీతిలో వ్యాఖ్య‌లు చేసింది.

ఇండియా నిరుపేద దేశ‌మ‌ని, జ‌నాభా ఎక్కువ‌ని, పోయిన త‌న ఐఫోన్ ఖ‌రీదు భార‌త్‌లో ఒక వ్య‌క్తి త‌న జీవిత‌కాలంలో సంపాదించే సొమ్ముకు స‌మాన‌మ‌ని త‌న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో రాసుకొచ్చింది. అయితే అదృష్ట‌వ‌శాత్తూ ఓ వ్య‌క్తి (ఇండియ‌న్‌) త‌న‌కు దొరికిన గ్రేడీ ఐఫోన్‌ను వెన‌క్కి తీసుకొచ్చి ఆమెకు ఇచ్చేశాడు. అయినా ఆమె సంతృప్తి చెంద‌లేదు. మ‌న దేశాన్ని కించ‌ప‌రిచేలా మ‌రో కామెంట్ చేసింది. త‌న ఐఫోన్‌ను త‌న‌కు వెన‌క్కి తెచ్చి ఇచ్చిన వ్య‌క్తి వ‌ద్ద కూడా ఐఫోన్ X ఉంద‌ని, ఇండియాలో అస‌లు ఐఫోన్ కొనే తాహ‌తు ఎవ‌రికి ఉంటుంద‌ని, అలాంటిది త‌న‌కు త‌న ఫోన్ తెచ్చి ఇచ్చిన వ్య‌క్తి వ‌ద్ద ఐఫోన్ ఉండ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని కామెంట్ పెట్టింది. దీంతో గ్రేడీ పోస్టులు కాస్తా నెట్‌లో వైర‌ల్ అయ్యాయి.

అలా ఆమె పోస్టులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగానే భార‌తీయులంతా పెద్ద ఎత్తున స్పందించారు. జాత్యహంకార వ్యాఖ్య‌లు చేసినందుకు గ్రేడీపై భార‌తీయులు విరుచుకు ప‌డ్డారు. ఆమెపై తీవ్రంగా విమ‌ర్శ‌లు చేశారు. దీంతో గ్రేడీ తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు త‌న బ్లాగ్‌లో క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. అంతేకాదు, నెటిజ‌న్ల ధాటికి తాళ‌లేక దెబ్బ‌కు త‌న ఇన్‌స్టాగ్రాం ఖాతాను క్లోజ్ చేసేసింది. అదీ మ‌రి.. ఇండియన్స్ దెబ్బ అంటే.. జాత్య‌హంకార‌, వ‌ర్ణ వివ‌క్ష వ్యాఖ్య‌లు చేస్తే ఎవ‌రికైనా ఇండియ‌న్స్ ఇలాగే గ‌ట్టిగా బుద్ధి చెబుతారు మ‌రి..! అదీ ఇండియ‌న్స్ ప‌వ‌ర్‌..!

Read more RELATED
Recommended to you

Exit mobile version