ఒకేరోజు నాలుగు బహిరంగ సభలలో పాల్గొననున్న అమిత్ షా

-

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా తెలంగాణకు రానున్నారు. అదే రోజున సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఆ తర్వాత నల్గొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్‌లలో నిర్వహించే సభలలో పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా 17న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే 18కి వాయిదా పడింది.

ఈసారి బీజేపీ బీసీ నినాదం ఎత్తుకుందని మనకు తెలుసు. ఎస్సీ వర్గీకరణ హామీ ద్వారా.. వారి మద్దతు కోసం ప్రయత్నిస్తోందని కూడా మనకు తెలుసు. మేనిఫెస్టో కూడా ఇలాంటి అంశాలను ఫోకస్ చేస్తూ ఉండబోతోందన్నది కొత్త విషయం. కాంగ్రెస్ 6 గ్యారెంటీ పథకాలు ప్రకటించింది కదా.. అందుకే బీజేపీ.. ప్రధాని మోదీ గ్యారెంటీ పేరుతో మేనిఫెస్టో తేబోతోందని అంటున్నారు. ఐతే.. ప్రధాని మోదీ కూడా కొన్నిసార్లు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నది మనకు తెలుసు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version